ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 151 ధాన్య కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు,ఇట్టి కేంద్రాలు ఏప్రిల్ 1 నుండి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. జిల్లాలో రబీలో 171357 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రానున్నట్లు అంచనా వుందని అన్నారు. ఐకెపి ద్వారా 28, పిఏసిఎస్ ద్వారా 96, డిసిఎమ్ఎస్ ద్వారా 27 ధాన్య కొనుగోలు కేంద్రాలు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. గన్ని బ్యాగులు, తూకం, తేమ యంత్రాలు, ప్యాడీ క్లినర్లు కేంద్రాలకు అందజేయాలన్నారు. కేంద్రాల బాధ్యులకు శిక్షణ నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న కేంద్రాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సెక్టార్ల వారిగా ధాన్య రవాణాకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను సిద్ధం చేయాలన్నారు. మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత వారితో సమావేశాలు చేపట్టాలన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నీడ, త్రాగునీరు తదితర మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. ఎఫ్ఏక్యూ ప్రకారం తేమ శాతం వుండేలా, తాల్ లేకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి, కనీస మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం, జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, డిఆర్డీఓ సన్యాసయ్య, ఆర్టీవో ఆఫ్రీన్, డిఎం మార్కుఫెడ్ సునీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 లోగా ప్రారంభించాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS