స్థానిక సంస్థలు, పట్టబధ్రుల ఎన్నికలకు సర్వం సిద్ధం
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
స్థానిక సంస్థలు పట్టబధ్రుల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు.కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలో నాలుగు పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేయడమైనదని,ఇందులో పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం,టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం,పలాస ఆర్డీఓ కార్యాలయం,శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయాలు ఉన్నట్లు చెప్పారు.పట్టబధ్రుల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. పట్టబధ్రుల ఓటర్లు 56,256 మంది నమోదు చేసినట్లు తెలిపారు.స్థానిక సంస్థల ఓటర్లు 776 మంది ఉన్నట్లు వివరించారు.స్థానిక సంస్థల ఓటర్లకు ఇప్పటికే ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసి పోలింగ్ కేంద్రాలను తెలియజేసినట్లు స్పష్టం చేశారు.
పట్టబధ్రుల ఓటర్లకు దాదాపు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.పట్టబధ్రుల ఎన్నికలకు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం,పలాస ఆర్డీఓ కార్యాలయం,శ్రీకాకుళంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో పిఓ,ఎపిఓలు,ఇతర సిబ్బంది,రిజర్వు సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.పోలింగ్ సిబ్బందికి ఏ విధమైన కొరత లేదన్నారు.సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ ఏర్పాట్లు చేసుకుంటానని తెలిపారు.ఒక గంట ముందు అభ్యర్థులకు సంబంధించి ఏజంట్లు చేరుకోవాలని, చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్,ఎలక్షన్ కమీషన్ సూచనల ప్రకారం పోలింగ్ ప్రక్రియ సాగుతుందన్నారు.పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని వివరించారు.ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.ఎవరైనా ఓటరు స్లిప్పు అందకపోతే,తమ పోలింగు కేంద్రాన్ని తెలుసుకొని ఓటరు గుర్తింపు కార్డు తీసుకువెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు.అంతకు ముందు టిపిఎం స్కూల్ లో ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.