SAKSHITHA NEWS

యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు బ్రాంచి నుండి 5 యూనిట్స్, వై.పాలెం బ్రాంచి నుండి 5 యూనిట్స్ మొత్తం 10 యూనిట్స్ మంజూరు చేయగా వాటిని .మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది అమ్మానిగూడిపడు లో వైదన.మరియమ్మ, జవ్వాజి.పార్వతి, చెన్నారాయునిపల్లి లో కౌత.సుబ్బలక్షమ్మ, గంగుపల్లి లో పువ్వాడ.సుబ్బలక్షమ్మ, వాదంపల్లి లో పోలిశెట్టి.తిరుమలమ్మ, గురిజేపల్లి లో వి.ప్రభావతి, వై.పాలెం లో షేక్.జైబున్, షేక్.సలీమ, గొంగటి.మహాలక్షమ్మ, యం.మరియమ్మ లకు ఒక్కో యూనిట్ 105000 లతో మొత్తం 10 యూనిట్స్ మంజూరు చేయడం జరిగింది దీనిలో 35% సబ్సిడీ, 10% లబ్ధిదారుని వాటా, 65%బ్యాంక్ రుణం గా మంజూరు చేయడం జరిగింది లబ్ధిదారులతో .మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ యూనిట్స్ పెట్టు కొని ప్రగతి పదం లో నడవాలని తెలియ జేసినారు అలాగే స్త్రీనిది నుండి ఈ సంవత్సరం వై.పాలెం మండలం లో 7 కోట్ల రూపాయలు రుణం ఇచ్చి 100% రికవరీ చేసిన సిబ్బంది ని మంత్రి శాలువా లతో అభినందించారు ఈకార్యక్రమంలో యం.పి.పి. డి.కిరణ్ గౌడ్, జడ్పీటీసీ సి.హెచ్.విజయభాస్కర్, ఎక్స్ ఏ.యం.సి.ఛైర్మెన్ ఒంగోలు.మూర్తిరెడ్డి, కన్వీనర్ కె.సి.హెచ్.ఓబులరెడ్డి ఏరియా కోర్దినేటర్ కుందురు.లక్ష్మిరెడ్డి, ఎపిజిబి మేనేజర్లు చంద్ర శేఖర్, నాగరాజు, స్త్రీనిది మేనేజర్ యం.నరేంద్ర, ఎపియం మూల.వెంకిరెడ్డి, లబ్ది దారులు, విఓఏ లు పాల్గొన్నారు


SAKSHITHA NEWS