దిల్ కుష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కాలనీలో నూతన 18 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు

Spread the love

Dil Kush Nagar Welfare Association installed 18 new CCTV cameras in the colony

సాక్షిత : బాలానగర్ డివిజన్ పరిధి దిల్ కుష్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కాలనీలో నూతన 18 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క సీసీ కెమెరాల ప్రారంభత్సోవానికి * కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించడం జరిగింది.


అనంతరం దిల్ కూష్ నగర్ అప్రోచ్ రోడ్డు వేసి ఒక్క సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కేక్ కట్ చేయించి రోడ్డు వేసినందుకు కాలనీ వాసుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో దిల్ కుష్ నగర్ అధ్యక్షులు మొహమ్మద్ మోహ్సిన్,కాలనీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ జమీల్,తెరాస పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాజా నాయకులు దేవులపల్లి కృష్ణమూర్తి మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానికులు పాల్గొనడం జరిగింది…

Related Posts

You cannot copy content of this page