SAKSHITHA NEWS

డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక రద్దు.

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఫిబ్రవరి 3 వ తేదీన రద్దు చేస్తున్నట్లు కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 3 వ తేదీన నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉన్నందున రద్దు చేశామని తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలు సహకరించాలని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app