ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్
మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో గల మండల ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కొరకై “సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారి” ఆధ్వర్యంలో రూ. 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే అదనపు తరగతి గదులు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ , సంస్థ డైరెక్టర్ శ్రీమతి ఉష శ్రీ , మరియు మియాపూర్ డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలసి పాల్గొని శంకుస్థాపన చేసిన మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉప్పలపాటి శ్రీకాంత్ .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారు పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చాలఅభినందనీయమని సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన సమాజ హితం సమాజ సేవ చేయడం చాల గొప్ప విషయం అని, పాఠశాల ప్రాంగణంలో అదనపు తరగతుల గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, వితరణ గా గదులు నిర్మించడం చాలా గొప్ప విషయం అని వీటిని చక్కగా సద్వినియోగ పర్చుకొని ఓదార్యం చాలా గొప్పది అని , ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుడదనే ఉద్దేశ్యంతో సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ సంస్థ వారు ఎంతో ఓదార్యం తో పేద విద్యార్థులకు మేలు కలిగే విధంగా గదులు నిర్మిస్తున్నారు అని ,త్వరితగతిన పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , మంచిగా చదివి తల్లిదండ్రులకు ,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, అదేవిధంగా సమ్ టోటల్ CSR ప్రాజెక్ట్స్ వారు ఎంతో సహృదయం తో, సామాజిక దృక్పథంతో CSR ఫండ్ కింద పేద విద్యార్థులకు అదనపు తరగతి గదులు మరియు చక్కటి మౌలిక వసతులు వితరణ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని ,వారి ఉదరత కు చాలా అభినందనియం అని,అలాగే ప్రతి ఒక్కరు సమాజం కొరకు చేయూతనందించాలని, ఎదో ఒక రూపంలో సహాయం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గాంధీ ,కార్పొరేటర్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ HM రాంమోహన్ రావు, ఉపాధ్యాయులు అర్చన, విజయ, వనజ, విద్యార్థులు మరియు మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.