Development of Bhagat Singh Nagar is our mission – Corporator Shravan, Pura Santhosh
భగత్ సింగ్ నగర్ అభివృదే మా ధ్యేయం – కార్పొరేటర్ శ్రావణ్, పుర సంతోష్
మల్కాజిగిరి సాక్షిత ప్రతినిధి;-
మల్కాజిగిరి 140 డివిజన్ పరిధిలో నీ అభివృద్ధి పనులు నిమిత్తం స్ధానిక కార్పొరేటర్ శ్రావణ్ భగత్ సింగ్ నగర్ లో శుక్రవారం అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి భగత్ సింగ్ నగర్, ఎల్బీనగర్ మారుతి నగర్ తదితర జిహెచ్ఎంసి ఖాళీ స్థలాలన పార్కులుగా మార్చాలని పరిశీలించడం జరిగినది.
ఇందులో భాగంగా భగత్ సింగ్ నగర్ పార్కు విచ్చేసిన అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్, కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ చాలా రోజులగా మల్కాజిగిరి 140 డివిజన్ ఏస్ సి సెల్ మోర్చ అద్యక్షుడు కోరిక మేరకు భాగంగా భగత్ సింగ్ నగర్ , న్యూ విద్యా నగర్ ప్రజలకు అందుబాటులో ఓపెన్ జిమ్, వాకింగ్ బే, తదితర పరికరాలు ,పిల్లలు ఆడుకోడానికి పరికరాలు, పార్క్ సాంక్షన్ త్వరగా చేసి పనులు ప్రారంభించాలని కోరడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ నగర్ వాసులు గడ్డం భాస్కర్,లింగం, విక్కీ, సరాంగం,గడ్డం వినోద్,శ్రీనివాస్,జగదీష్, పోలీస్ రాములు,సత్యనారాయణ,శియాలింగం, శ్రీదేవి, సాయి లక్ష్మి, రాజ్యలక్ష్మి,జయమ్మ,సరిత, న్యూ విద్యా నగర్ నగర్ కాలనీ వాసులు బిజేపి నాయకులు మురళి గౌడ, నందు యాదవ్, శ్రీకాంత్,డైరెక్టర్ శ్రీనివాస్ టీమ్, బిజేపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.