SAKSHITHA NEWS

విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎస్.ఎన్.ఆర్ గార్డెన్స్ నందు నిర్వహించిన “శ్రీ వేదంతా పబ్లిక్ స్కూల్” అన్యూవల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , శ్రీధర్ , ఆర్.కె.సింగ్ , సురేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…..విద్యార్ధులు విద్యను కష్టంగా కాకుండా ఇష్టంగా అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అంతేకాక విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్వేత సింగ్, విద్యార్ధుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app