SAKSHITHA NEWS

సాక్షిత సికింద్రాబాద్ : వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్ది, కార్పొరేటర్ సామల హేమ, డిప్యూటీ కమీషనర్ దశరద్, అధికారులు ఆశాలత, కృష్ణ, సంధ్య, బీ ఆర్ ఎస్ నేతలు రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు తదితరులతో కలిసి బీదలబస్తీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలను పరిష్కరించుకొనేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పే లా వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. సీనియర్ అధికారుల బృందాలు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పర్యటించి, ఆయా పరిస్థితులను అద్యయనం చేసి హైదరాబాద్ లో వార్డు కార్యాలయాల వ్యవస్థను ప్రతిపాదించాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని వారిని ప్రజలు సదివినియోగం చేసుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు. జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మునిసిపల్ డివిజన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసామని , ఇతర వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా వార్డులకు పంపేలా కుడా ఏర్పాట్లు జరిపామని తెలిపారు.
సర్వాంగ సుందరంగా సికింద్రాబాద్ కాలనీ పార్కులు
సితాఫలమండీ లోని టీ ఆర్ టీ కాలనీ పార్కు, మధురా నగర్ కాలనీ పార్కు ల్లో వివిధ కొత్త సదుపాయాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని అన్ని కాలనీ పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ సామల హేమ, నేతలు రామేశ్వర్ గౌడ్, శేఖర్, పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS