SAKSHITHA NEWS

సాక్షిత సికింద్రాబాద్ : పేద ప్రజలకు ఉపకరించే పధకాలను అమలు పరచడంలో తెలంగాణా రాష్ట్ర అగ్ర స్థానంలో నిలుస్తుందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి పధకాలకు చెందిన లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. దాదాపు 191 మంది లబ్దిదారులకు రూ.1. 85 కోట్ల విలువజేసే చెక్కులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, శ్రీమతి కంది శైలజ, బీ ఆర్ ఎస్ యువనేతలు కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్, రాజ సుందర్, జలంధర్ రెడ్డి తదితరులతో కలిసి అందచేశారు. 151 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 65 సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు పెళ్ళిళ్ళు ఓ శాపంగా మారకుండా ప్రభుత్వం సాయం చేస్తోందని అన్నారు. సీ ఏం కెసిఆర్ అమలు జరుపుతున్న పధకాలు పేదలకు వరంగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో దళారీ లు జ్యోకం చేసుకొనే డబ్బులు వసూలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. ప్రజలు తమ అన్ని అవసరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని పద్మారావు గౌడ్ సూచించారు.
అందించిన చెక్కుల వివరాల –


అడ్డగుట్ట డివిజన్ : 55 కళ్యాణ లక్ష్మి/శాదిముబరాక్ చెక్కులు, 6 సీ ఏం ఆర్ ఎఫ్ చెక్కులు, విలువ : 56.80 లక్షల రూపాయలు
తార్నాక : 19+10 చెక్కులు : రూ.22.72 లక్షలు
మెట్టుగూడ : 8+5 చెక్కులు : 10.15 లక్షలు
సితాఫలమండీ : 40+13 చెక్కులు : 32.66 లక్షలు
బౌద్దనగర్ : 29+10 చెక్కులు ; 45.30 లక్షలు
ఇతరులు : 25 చెక్కులు : 16.60 లక్షలు
మొత్తం : 151+65 చెక్కులు : 1,84, 23,000


SAKSHITHA NEWS