SAKSHITHA NEWS

అక్రమంగా గోవులను తరలిస్తున్న డిసిఎం బోల్తా

— పలు గోవులకు తీవ్ర గాయాలు 1 గోవు మృతి

— డీసీఎం లో సుమారు 50 గోవులను తరలిస్తున్నారు.

చిట్యాల సాక్షిత ప్రతినిధి

పోలీసులు అధికారులు ఎన్ని కఠిన చర్యలు ఆంక్షలు విధించిన ఏదో ఒకచోట నుండి అక్రమంగా గోవులను కోడేదూడలను కబేలాలకు తరలిస్తూనే ఉన్నారు
చిట్యాల జాతీయ రహదారి 65 పై గోవులను,కోడెదూడలను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్న TS 07 UK 2925 నంబర్ గల డీసీఎం హైదరాబాద్ వైపు వెళ్తూ చిట్యాల మండలం వెలిమినేడు శివారులో బోల్తా పడింది.
వాహనం బోల్తా కొట్టడంతో అందులో ఉన్న గోవులు కోడెదూడలు చెల్లాచెదరయ్యాయి.
స్థానికులు, వాహనదారులు కుప్పలుగా పడి ఉన్న గోవులను త్వర త్వరగా బయటికి తీసి రక్షించారు. చాలా వరకు గోవులు పారిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు పశు వైద్యాధికారులను పిలిపించి గాయపడ్డ గోవులకు వైద్యం చేయించారు. అక్కడ పడి ఉన్న గోవుల్లో 1 చనిపోగా మిగతా 19 గోవులను చండూరులోని గోషాలకు తరలించారు. దాదాపు డీసీఎం లో చిన్న పెద్ద గోవులు అన్నీ కలిపి 50 వరకు ఉన్నాయి. సుమారు 30 గోవులు పారిపోయాయి. డీసీఎం బోల్తా పడగానే డ్రైవరు పరారయ్యాడు. ఇంకొక వ్యక్తికి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


SAKSHITHA NEWS