నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)
నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నిమ్మకాయల మార్కెట్ పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దైద రవీందర్ సందర్శించారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రైతులు యాసంగి పంటను తీసుకొని వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రాశులు పోసి దాదాపు 15 దినాలు అవుతున్న కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ఎండలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గోనే సంచులు , సూతిలి ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు సమన్వయంతో పనిచేసి వెంటనే ధాన్యాన్ని గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి వెంటవెంటనే కాంటాలు వేసి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎండలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తాగునీటి వసతి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, ఎండి యూసుఫ్ , బీరవోలు ఉపేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు దేవిక , ధనమ్మ , తిరుపతమ్మ , చెనగోని రాజశేఖర్ గౌడ్ , వంటెపాక సతీష్, తదితరులు పాల్గొన్నారు.