ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి – దైద రవీందర్

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించని ఐకెపి,పిఏసిఎస్ సెంటర్లలో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్
దైద రవీందర్ అన్నారు.
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రన్నీ సందర్శించారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ ఇక్కడ మరియు రామన్నపేట మండలంలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదని తమ దృష్టికి వచ్చిందని నకిరేకల్ నియోజకవర్గం లో ఎక్కడెక్కడ ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదో అక్కడ కొనుగోళ్లు ప్రారంభించాలని సెంటర్లలో కనీస వసతులు లేక మండే ఎండల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ,
గుండ్రాంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు నమ్ముల విజయ్ కుమార్ , మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి , మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, మధుసూదన్, ఎంపిటిసి దుబ్బ పద్మ కుమార స్వామి, వార్డ్ మెంబర్ అండాల ప్రవీణ్ కుమార్ , దుబ్బ విగ్నేశ్వర్, కాసర రాజు , చంద్రశేఖర్ , జిల్లా లింగస్వామి , యాదయ్య , నమ్ముల కిరణ్ , సీనియర్ నాయకుడు కృష్ణయ్య , బండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page