మినీ మహానాడు ఏర్పాటల్లో డా౹౹చదలవాడ

Spread the love

మినీ మహానాడు ఏర్పాటల్లో డా౹౹చదలవాడ

నరసరావుపేట పట్టణ శివారులో మినీ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.స్థానిక టీడీపీ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ కలిసి మినీ మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించారు.మినీ మహానాడుకు తరలి వచ్చే అతిధులు,కార్యకర్తల కోసం మహానాడు వేదికను,పార్కింగ్‌ సదుపాయాలను పరిశీలించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికే ప్రాంతాన్ని పలు అంశాల గురించి చర్చించారు.ఆయన వెంట టీడీపీ నాయకులు పూదోట సునీల్,గొట్టిపాటి జనార్దన్ బాబు,కడియం కోటి సుబ్బారావు,కొల్లి వెంకటేశ్వర్లు,కొట్ట కిరణ్,కొల్లి బ్రహ్మయ్య,వాసిరెడ్డి రవి,రావెల జ్ఞాని,కుమ్మేత కోటి రెడ్డి,అత్తులూరి సుబ్బారావు,కొవ్వూరి బాబు,మాబు,సైదవాలి,బడే బాబు, రాపర్ల జగ్గారావు,శ్రీరామినేని ప్రసాద్,చల్ల సుబ్బారావు,సంజీవ్ రావు,చితిరాల బాలు,నాగూర్,జాస్తి చంద్ర శేఖర్,ఖలీల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page