పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి

Spread the love

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి

పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 అదనంగా ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు

విషయం : కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించడం ,పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు చెల్లించడం గురించి

గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నందు జిల్లా కలెక్టర్ బి.సంతోష్ కి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా కలిసి సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు రైతులకు నష్టపరిహారం పంటకు మద్దతు ధర క్వింటాలకు 500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ….

జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నది. వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. వరి తో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చింది. ఖరీఫ్ నుంచే ఈ బోనస్ చెల్లింపు ను అమలు చేస్తామని చేయలేదు. యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం .మా రెండు డిమాండ్లయిన పంట నష్టం వివరాల సేకరణ ,బోనస్ చెల్లింపుల పై సానుకూలంగా స్పందింస్తారని ఆశిస్తూ

త్వరగా ప్రభుత్వం రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం మరియు క్వింటా లకు మద్దతు ధరలను తీయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ప్రతాప్ గౌడ్ , విజయ్ రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, గద్వాల మండలం పార్టీ అధ్యక్షులు రాముడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, హనుమంతు నాయుడు, రాధాకృష్ణారెడ్డి, సతీష్, ప్రభాకర్ గౌడ్,రిజ్వాన్, నవీన్ రెడ్డి, కురుమన్న,నర్సింహులు ,వాసుతిక్కన్న, మేస్త్రి తిమ్మప్ప, మధు, గంజి పేట రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page