SAKSHITHA NEWS

Crimes should be completely curbed

నేరాలు పూర్తిస్థాయిలో అరికట్టాలి

మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌,అదనపు ఎస్పీ ప్రసాద్‌


సాక్షితకర్నూలు: దొంగతనాల కేసుల్లో నిందితుల అరెస్టు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి నేరాలను అరికట్టాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశించారు.నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నేరాల నియంత్రణపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.గతేడాది కంటే కేసుల సంఖ్యను తగ్గించాలన్నారు.

దర్యాప్తులో నాణ్యత ఉండాలని సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.టెక్నాలజీ వినియోగంపై ప్రతి ఒక్కరూ రెండు వారాల శిక్షణ పొందాలన్నారు.పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇ-చలానా,ప్రాపర్టీ కేసుల రికవరీకి ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.

నెలాఖరులోగా దొంగతనాల కేసులకు సంబంధించి రికవరీ ఎనభై శాతం అధిగమించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది.


అనుమానాస్పద మృతి, అదృశ్యం,మద్యం,తీవ్ర నేరాల కేసుల దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. రహదారి ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో వేగ నియంత్రణ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు దర్యాప్తు నైపుణ్యం పెంచుకోవాలని చెప్పారు.కర్నూలు, పత్తికొండ,ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలోని ప్రతి కేసును సమీక్షించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రసాద్‌,డీఎస్పీలు వెంకటాద్రి,వెంకట్రామయ్య, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌, నాగభూషణం,మహేష్‌, సీఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS