SAKSHITHA NEWS

*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.*

నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల టౌన్ DSP సి .మహేశ్వర్ రెడ్డి గారు విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లను సృష్టించి మోసపూరితమైన ఉద్దేశ్యముతో అమాయకులకు అమ్మి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా సభ్యులు చవ్వ పవన్, తిరుమలయ్య @ తిరుమల్, మౌలాలి, ఖాసిం, మరియు డాక్యుమెంట్ రైటర్ లు సుమంత్, అస్లామ్, దాదాపీర్, నబీరసూల్ ల అరెస్టు. మరికొంత మంది ముఠా సభ్యులు పరారీ.

*అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు* :

1) చవ్వ పవన్, వయస్సు 45 సం. తండ్రి. దస్తగిరి, R/o నందమూరి నగర్, దర్గా లైన్, నంద్యాల టౌన్
2) మునిపాటి తిరుమలయ్య @ తిరుమల్, వయస్సు 43 సం. తండ్రి. మునిపాటి ప్రతాప్ R/o నివర్తి నగర్, నంద్యాల
3) సాది ఖాసిం, వయస్సు 36 సం. తండ్రి. బాలన్న, R/o R.S గాజులపల్లే గ్రామం, మహానంది మండలం.
4) మాదరి మౌళాలి, వయస్సు 30 సం. తండ్రి. బాలన్న, R/o R.S గాజులపల్లే గ్రామం, మహానంది మండలం.
5) అనుమంచి కృష్ణ సుమన్ @ సుమంత్, వయస్సు 39 సం. తండ్రి. అనుమంచి సత్యరంగ రాజేశ్వరరావు R/o అయ్యలూరు గ్రామం, నంద్యాల మండలం.
6) షేక్ అస్లామ్ బాషా, వయస్సు 34 సం. తండ్రి. S.A గఫూర్ R/o కోట వీధి,నంద్యాల టౌన్.
7) షేక్ తెల్లగుండం దాదాపీర్ వయస్సు 28 సం. తండ్రి. షేక్ తెల్లగుండం షిలార్ R/o వెంకటచలం కాలనీ నంద్యాల టౌన్,
8) సయ్యద్ నభిరసూల్ వయస్సు 37 సం. తండ్రి. క్రీ.శే. సయ్యద్ ఖలీల్ R/o గుడిపాటిగడ్డ, నంద్యాల టౌన్
<<>>
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామ పురం, గ్రామానికి చెందిన సంగా లక్ష్మీకాంత రెడ్డి అను వ్యక్తి నంద్యాల టౌన్ లో నివసించే రౌడీ షీటర్లు అయిన తిరుమలయ్య @ తిరుమల్, రాగినేని సంజీవ, మరియు మౌలాలి, ఖాసిం, చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులు లు అను వ్యక్తుల సహకారముతో, నంద్యాల, నూతనముగా జిల్లా అవుతున్నదని 2020 వ సం.లో నంద్యాల టౌన్ లో RARS కు దగ్గరలో ఉదయానంద హాస్పిటల్ వెనుక వైపున ఉన్న 50 సెంట్ల స్థలమునకు సంబందించిన 3220/1995 డాక్యుమెంట్ ను మహేంద్రకర్ వెంకట లక్ష్మిబాయి పేరు మీద ఉన్నదని తెలుసుకొని సదరు డాక్యుమెంట్ యొక్క సర్టిఫైడ్ కాపీని సంగా లక్ష్మీకాంత రెడ్డి తన అనుచరుడైన రాగినేని సంజీవ ద్వారా నంద్యాల సబ్-రిజిస్ట్రార్ నుండి పొంది, సదరు మహేంద్రకర్ వెంకట లక్ష్మి బాయి 2002 లో చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్ ను సృష్టించి, సదరు 50 సెంట్ల స్థలమునకు వారసురాలుగా, మహేంద్రకర్ వెంకట లక్ష్మి బాయికి కూతురు గా సోడమ్ వెంకట లక్ష్మమ్మ కూతురనీ నకిలీ ఫామిలీ సర్టిఫికేట్ సృష్టించి, ఆమే ద్వారా మొదటగా వారి అనుచరులు అయిన చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులు, హుస్సేన్ ల పైన నంద్యాల రిజిస్టర్ ఆఫీసులో 18.12.2020 వ తేదీన వారికి అనుకూలముగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ అయిన సుమంత్, సహకారంతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినారు.
తరువాత చవ్వ పవన్ మరియు ఆవుల శ్రీనివాసులు లు వారి పేరు మీద ఉన్న ప్లాట్లను నంద్యాల రిజిస్టర్ ఆఫీస్ లో వారికి అనుకూలముగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ దాదాపీర్ సహకారంతో నంద్యాల టౌన్, చాంద్ బాడ కి చెందిన పెరికల కిరణ్ కుమార్ కు 2021 వ సం.లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినారు.
అయితే సదరు 50 సెంట్ల స్థలము లో గతంలో వేయబడిన 62, 63 నంబర్ ప్లాట్లకు అసలు ఓనర్ అయిన రూపనగుడి బాలసుబ్బారెడ్డి అను వ్యక్తి సదరు కిరణ్ కుమార్ కు, సోడమ్ వెంకట లక్ష్మమ్మ కు, డిస్ట్రిక్ట్ ర్జిజిస్ట్రార్ కు లీగల్ నోటీసులు పంపివ్వగా, సంగా లక్ష్మీకాంత రెడ్డి, తన మోసం బయటపడిందని, తన అనుచరులు అయిన చవ్వ పవన్ మరియు ఆవుల శ్రీనివాసుల కు సోడమ్ వెంకట లక్ష్మమ్మ ద్వారా తేదీ 18.12.2020 న చేయించిన రిజిస్టర్ ను నంద్యాల రిజిస్టర్ ఆఫీస్ నందు, జనవరి నెల 2023 వ సం.లో రద్దు చేసుకున్నారు.
తరువాత పెరికల కిరణ్ కుమార్ తను మోసపోయానని తెలుసుకొని తను ఇచ్చిన 18 ½ లక్షలు రూపాయలను తిరిగి ఇవ్వమని చవ్వ పవన్, ఆవుల శ్రీనివాసులను అడుగగా, పెరికల కిరణ్ కుమార్ ను తిరుమలయ్య @ తిరుమల్, రాగినేని సంజీవ ల చేత కిరణ్ కుమార్ ను చంపుతామని బెదిరించినారని, వారికి బయపడి తేదీ 24.04.2023 న నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వారి పైన క్రైమ్.నంబర్ 75/2023 SC/ST కేసు నమోదు అయినది.
ఈ కేసులో ముద్దాయిలైన చవ్వ పవన్, తిరుమలయ్య @ తిరుమల్, మౌలాలి, ఖాసిం, మరియు డాక్యుమెంట్ రైటర్ లు సుమంత్, అస్లామ్, దాదాపీర్, నబీరసూల్ లను దర్యాప్తు అధికారి అయిన నంద్యాల SDPO గారు నంద్యాల టౌన్, రైతునగరం ఏరియా వసంత నగర్ వెంచర్-2 లో తేదీ 14.05.2023 న ఉదయము 10.30 గంటలకు అరెస్టు చేయడమైనది. వారి వద్ద నుండి కొన్ని డాక్యుమెంట్ పత్రాలు, ప్రబుత్వ అధికారుల మరియు కార్యాలయాల నకిలీ సీల్లు, ఒక చెక్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ నేరములో పాల్గొన్న మరికొంత మంది ముద్దాయిలు పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను SP శ్రీ రఘువీర్ రెడ్డి గారి పర్యవేక్షణ లో ఏర్పాటు చేయడమైనది.

జిల్లా పోలీసు కార్యలయం నంద్యాల.


SAKSHITHA NEWS