SAKSHITHA NEWS

మేడే నీ ఘనంగా జరపాలి. సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపు.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

మే డే ని ఘనంగా జరపాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఖమ్మం త్రీ టౌన్ లో 30 డివిజన్ సుందరయ్య నగర్ శాఖ సమావేశం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ హిమామ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని వేట్టి చాకిరికి వ్యతిరేకంగా చికాగో నగరంలో 18 గంటల పని దినాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఫ్యాక్టరీలలో పోరాటాలు చేస్తున్న వారిపై యాజమాన్యాలు తుపాకీ తూటాలతో కార్మికుల్ని పొట్టన పెట్టుకుంది ఆ కార్మికులు తమ రక్తంలో తమ ఒంటిపై చొక్కా విడిచి ఆ రక్తంలో ముంచి ఇదే మా జెండా ఎర్రని జెండా అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా కార్మికుల సమస్యల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్న కార్మిక ఎర్రజెండా అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వస్తున్నది కాబట్టి కార్మికుల దినోత్సవం ఖమ్మం త్రీ టౌన్ లో అన్ని డివిజన్లో జెండాలు ఎగురవేసుకొని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మేడే దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ జరుగుతుంది ఈ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొనుచున్నారు కావున కార్మికులందరూ పార్టీ సభ్యులు అందరూ కూడా ఎర్ర చొక్కాలు ధరించి సభకు రావాలని ఆయన కోరారు ఈ సమావేశంలో సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ నాయకులు రంగు హనుమంతచారి, శాఖ కార్యదర్శి పెద్దోజు ఉపేంద్ర చారి, మద్ది శ్రీను, ఎర్ర నగేష్, షేక్ కులసనా బేగం, పొదిళ్ల రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 04 29 at 9.05.01 PM

SAKSHITHA NEWS