ఓపెన్ నాలా డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

124 డివిజిన్ పరిధిలోని పరికి చెరువు నుండి ఆల్విన్ కాలనీ ఫేస్ 2 మీదుగా పైప్ లైన్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న ఓపెన్ నాలా, వరద నీటి కాలువ పైపులైన్లలో జరుగుతున్న పూడికతీత పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఏ.ఇ శ్రావణి తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఓపెన్ నాలా పూడికతీత పనులను మాన్సూన్ కు ముందుగానే పూర్తిచేస్తామని అన్నారు. వేసవి కాలంలోనే పనులు పూర్తిచేస్తే వర్షాకాలంలో వచ్చే వరద నీరు అంతా సజావుగా దిగువకు వెళ్ళిపోతుంది కాబట్టి లోతట్టు ప్రాంతలవారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, పాండుగౌడ్, ప్రదీప్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page