హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరాలను జిహెచ్ఎంసి మరియు హరికల్చర్ అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ అడ్డగుట్ట కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లోగల పార్కుని పరిశీలించడం జరిగిందని పార్క్‌ని అత్యుత్తమ సౌకర్యాలతో, ప్రజలకు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా పార్క్‌కి వచ్చేలా వాతావరణం కల్పించాలని, పిల్లలు ఆడుకునేందుకు అనువుగా ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. వాకింగ్ చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ,వృద్దులకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాకింగ్ ట్రాక్ ను మరియు పార్క్ ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో అన్ని రకాల మౌలిక వసతులు కలిపిస్తామని పార్క్ ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. పార్క్ అభివృద్ధి పనుల వేగవంతంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని కోరారు. చెరువుల పూడికతీత నుంచి వచ్చే మట్టిని వినియోగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మీ కాలనీ లో, బస్తీలలో గల ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, హార్టికల్చర్ దాసు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.