SAKSHITHA NEWS

Control of crime through visible policing

విజబుల్ పోలీసింగ్ ద్వారానే నేరాల నియంత్రణ

చోరి సొత్తు రికవరీలో క్షేత్రస్దాయిలో ఫోకస్

రాత్రివేళలో పోలీస్ గస్తీ ముమ్మరం

నగరంలోని హోటల్స్, లాడ్జీలలో విస్తృత తనిఖీలు

నేర నిరూపణలో స్పష్టమైన ప్రణాళిక

క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , పోక్సో , ఎస్సీ ఎస్టీ కేసులపై డివిజన్ పోలీస్ అధికారుల పర్యవేక్షణ

నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా దృష్టి


సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విజబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలకు చెక్ పెట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
మంగళవారం నాడు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
జిల్లాలో శాంతిభద్రతలు ఎంత ముఖ్యమో నేరాలు జరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని అన్నారు. గత రెండు నెలలుగా వివిధ బందోబస్తు విధులలో బిజీగా భాధ్యతలు నిర్వహించిన పోలీసులు ఇకపై ప్రతిరోజు నగరంలోని రద్దీ ప్రాంతాలలో విజబుల్ పోలీసింగ్ తో పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా అక్రమ రవాణా నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోట
వారానికి ఒకసారి కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించడానికి జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అన్నారు.

నేర నిరూపణలో కీలక పాత్ర పోషించే దర్యాప్తు అధికారులు స్పష్టమైన ప్రణాళికతో పాటు మరింత నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ పరికరంతో రద్దీ ప్రాంతాలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ ను చెక్ చేయాలని అన్నారు.


నగర శివారు ప్రాంతాలలో ఎక్కువ దృష్టి సారించాలని,
ప్రజలు అప్రమత్తత, వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు నిరంతరం పోలీస్ ముమ్మర గస్తీ ద్వారా నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు. ఖమ్మం డివిజన్ లో సెక్టార్ వారిగా భాధ్యతలు అప్పగించిన ఏస్సైలు ఏలాంటి సంఘటనలు జరగకుండా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలని సూచించారు.

నేరస్ధులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్లు క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా బైక్‌ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్ టిజింగ్, అర్ధరాత్రి రోడ్లపై పుట్టిరోజు వేడుకలు చేస్తూ…


మద్యం మత్తులో తిరిగే అకాతాయిలను అడ్డుకట్ట వేసేందుకు డ్రంకెన్ & డ్రైవ్
తనిఖీలు ముమ్మరం చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, బహిరంగ మద్యపాన స్థలాలు మరియు జనాలు గుమిగూడే హాట్‌స్పాట్‌లపై దృష్టి పెట్టాలని అన్నారు.


సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,అడిషనల్ డీసీపీ (ఆ ఆర్) కుమారస్వామి, ఏసీపీలు అంజనేయులు, భస్వారెడ్ధి, వేంకటేశ్, రహెమాన్, రవి, బాబురావు, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS