Construction of ropeway at Srikalahasti through Parvatmala program
పర్వతమాల కార్యక్రమం ద్వారా శ్రీకాళహస్తిలో రోప్ వే ఏర్పాటు చేయవలసినదిగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రకాష్ గౌర్ ని కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఢిల్లీలోని నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కార్యాలయంలో ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాష్ గౌర్ ని కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి దేశవ్యాప్తంగా పర్యాటకం మరియు మతపరమైన ప్రాముఖ్యతను మెరుగుపరచడానికి జాతీయ రోప్వే కార్యక్రమం ‘పర్వతమాల’ కింద రోప్ వేస్ కోసం ఆంధ్రప్రదేశ్లోని 26 సంభావ్య ప్రదేశాలను ఏపీటిడిసి గుర్తించి, అభివృద్ధి చేయాలని ప్రతిపాదించించి నాదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అందులో భాగంగా శ్రీకాళహస్తిలో జాతీయ రోప్వే కార్యక్రమం ‘పర్వతమాల’ కింద కొండ ప్రాంతాలలో పట్టణ రద్దీని తగ్గించడానికి అందుబాటులో ఉన్న ప్రాంతాలను అనుసంధానించాలని కోరడం జరిగిందన్నారు.
అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్, బస్టాండ్ నుండి కపిల తీర్ధం, కపిల తీర్ధం నుండి జూ పార్క్ వరకు రోప్ వే కి అనుకూలంగా ఉటుందని మ్యాప్ చూపిస్తూ వారికీ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి పట్టణంలో కూడా ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు రోప్ వే ఉపయోగపడుతుందని తెలియజేసారు. తిరుపతిలో, శ్రీకాళహస్తి లో రోప్ వే ఏర్పాటుపై ఆ సంస్థ సీఈఓ ఆసక్తి కనబరిచారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.