మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలితాల పైన చర్చలో భాగంగా కె.పి. వివేకానంద్ అసెంబ్లీలో ప్రసంగించారు..
సాక్షిత : ప్రజల యొక్క ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారు – అసెంబ్లీలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..
ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం చేసే అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలి..
ఎస్.ఎన్.డి.పి. పథకం ద్వారా చేపడుతున్న కాలువ నిర్మాణాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం లభించింది..
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలితాల పైన చర్చలో భాగంగా కె.పి. వివేకానంద్ అసెంబ్లీలో ప్రసంగించారు.
వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో నిరంతరంగా విద్యుత్ సరఫరా, ఇంటింటికి మంచి నీరు, హైదరాబాద్ నగరంలో 10 లక్షల సీసీ కెమెరాలు, 3866 కోట్లతో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ నగరం మౌలిక సదుపాయాల లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ప్రజలకు శుద్ధినీరుని అందించడంలో దేశంలోనే మొట్టమొదటి నగరంగా హైదరాబాద్ నగరం గుర్తించపడ్డది అని ఎమ్మెల్యే గారు అన్నారు,
కేటీఆర్ నాయకత్వంలో పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడే స్థాయికి చేరిందని..
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం దేశంలో మూడు నాలుగు నగరాలతో పోటీపడేదని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలోని పెద్దపెద్ద నగరాలు హైదరాబాద్ తో పోటీ పడే స్థాయికి వచ్చింది అని అన్నారు..
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు, ఎస్.ఎన్.డి.పి. పథకం ద్వారా చేపడుతున్న కాలువ నిర్మాణాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అంగడిపేట్, సుచిత్ర పరిసర లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం లభించింది అని వారు అసెంబ్లీ లో తెలిపారు..