కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జోడో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగానే కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో సీనియర్ నేత కొలన్. హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గాజుల రామారంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి.. జోడో విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైన ర్యాలీ షాపూర్‌లోని ఇందిరమ్మ విగ్రహం వరకు కొనసాగింది. తొలి విడత భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్ 7న ప్రారంభించిన రాహుల్ గాంధీ… కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
ఈ యాత్రలో రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. ప్రజల్లో ఒకడిగా. ప్రజల కోసం ఒక్కడుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు తాను అండగా ఉన్నానంటూ రాహుల్ ప్రజలకు భరోసాను కల్పించారు. తొలి విడత జోడో యాత్రతో ప్రజలకు మరింత చేరువయ్యారు రాహుల్ గాంధీ. మొదటిదశ జోడో యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో.. రెండో దశ జోడో యాత్రకు సిద్దమవుతున్నారు రాహుల్ గాంధీ.
ఈ యాత్ర గుజరాత్ నుంచి మేఘాలయ వరకు ఉండనుంది. రాహుల్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా జోడో విజయోత్సవ ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, టేకుల ప్రవీణ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సత్తి రెడ్డి, రఫాత్, ఎమ్ .ఎస్ చౌదరి, లక్ష్మణ్, శ్రీశైలం యాదవ్, శ్రీధర్ రెడ్డి, వీర రెడ్డి,ప్రతాప్ రెడ్డి, గణేష్, రాజశేఖర్, వేణు, మొండి సాయి కృష్ణ, తులసి రెడ్డి, షఫీ, ఎండీ.లాయక్, అజయ్, అన్వార్, అయిమాద్, పుల్లెం రాజు, నిఖిల్ రెడ్డి, వసంత్ కుమార్, మహిళ నాయకులు యాదమ్మ, కౌసల్య, గౌసియా, రెహానా బేగం , హసీనా, కుమారి, కమల,రమ్య NSUI నాయకులు మరియు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.