తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట

Spread the love

Congress is fighting over Telangana farmers’ issues

తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట


సాక్షిత : ధరణి పోర్టల్,రుణమాఫీ,రైతు భీమా,రైతు బంధు,పోడు భూముల బాధితుల సమస్యలపై టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో గండిమైసమ్మ వద్ద తహశీల్దార్ కార్యలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న టీపీసీసీ ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ సందర్భంగా నర్సరెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని,ధరణి పోర్టల్ వల్ల రైతు భీమా మరియు రైతు బంధు పధకాలలో కూడా అన్యాయం జరుగుతుంది అని తెలిపారు.ధరణి పోర్టల్ యొక్క సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

.కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి వచ్చిన వెంటనే ధరణి ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా పోడు భూముల సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానందం,కౌన్సిలర్లు రమా మాధవ రెడ్డి ,నవితా శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి,దుండిగల్ PACS డైరెక్టర్ శ్రీనివాస్,ఫిషెర్మెన్ కాంగ్రెస్ సెక్రెటరీ పోషి మహేశ్ ముదిరాజ్,

మాజీ వర్డ్ సభ్యులు పరశురామ్ గౌడ్, బత్తుల చిరంజీవి, 126 డివిజన్ మెమ్బర్షిప్ ఇంచార్జ్ గడ్డమీది భారత్ గౌడ్,యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొర అరుణ్,ఎన్‌ఎస్‌యూ‌ఐ నాయకులు బండి సాయి, ఒంపుగూడెం రాజిరెడ్డి, జక్కుల మల్లేశ్,

కుమార్ యాదవ్,సాధు యాదవ్,ఆర్కల విజయ్ గౌడ్,చింతకింది సురేశ్, మన్నే కుమార్,శ్రీనివాస్,దినేష్,పాల్,నాగ సందీప్,లక్ష్మీ దేవి, అచ్చెమ్మ, అమ్మాజీ, ఫాతిమా, సరోజా,రవి నాయక్, మరియు పెద్ద ఎత్తున రైతులు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page