బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కో ఆప్షన్ మెంబర్ హైదర్ అలీ…

Spread the love

పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య…

గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ ఎల్కూర్ హైదర్ ఆలీ శేషంపల్లి నర్సింహులు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు…కాంగ్రెస్ పార్టీ చెప్పబడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై,బిఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవలు చేసుకోలేక పోయానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే దిశగా కృషి చేస్తానని హైదర్ ఆలీ తెలిపారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లత్తిపురం వెంకట్రామిరెడ్డి,శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, జమ్మిచేడు సురేష్, తిమోతి,గోపాల్ వర్మ, ధరూర్ కుర్వ శ్రీనివాసులు,కృష్ణయ్య గౌడ్,స్వామి నాయుడు, రాము యాదవ్,సుభాస్,గోపాల్, లక్ష్మణ నాయుడు తదితరులు ఉన్నారు…

Related Posts

You cannot copy content of this page