SAKSHITHA NEWS

ప్రజాదర్బార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం..
జిల్లాకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..
వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్‌ అధికారికి బాధ్యతలు..
ప్రజా దర్బార్‌కి రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి..

ఇవాళ సీఎం రేవంత్ సచివాలయం వెళ్లాక వినతిపత్రాలు స్వీకరించిన మంత్రి సీతక్క.

గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్లకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడను కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి , ప్రజాదర్బార్ లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు.

హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.

Whatsapp Image 2023 12 08 At 4.45.39 Pm

SAKSHITHA NEWS