వినుకొండ పట్టణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా

Spread the love


Chief Minister YS Jaganmohan Reddy’s birthday was celebrated in Vinukonda town

సాక్షిత : *వినుకొండ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు అందరూ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనడం వలన వినుకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్బంగా వినుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలలో వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.

*భారీ కేక్ కట్ చేసి సీఎం జన్మదిన వేడుకలను ప్రారంభించిన వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * ముందుగా వైసీపీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరం
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సంధర్బంగా రక్తదానం చేస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు. రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదు, మానవ శరీరంలో ఇది సహజంగా తయారవుతుంది. అందుకే రక్తాన్ని రక్తదానం వల్ల మాత్రమే వేరొకరికి అందించగలము. ఈ రక్త దానం వలన నిండు గర్భిణీలను మరియు ప్రమాదంలో గాయపడిన, ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను పరోక్షంగా కాపాడినవారు అవుతామని, ఇది మనకు సాటిలేని సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ఈ సంధర్బంగా జగనన్న అభిమానులు, సానుభూతి పరులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారని తెలిపారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు మరియు ఆరోగ్య శాఖా సిబ్బంది సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసామని ఆనందం వ్యక్తం చేశారు.

భారీ అన్నదాన కార్యక్రమం
అనంతరం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జగనన్న జన్మదిన వేడుకల సందర్బంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page