సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్ లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైదర్ నగర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని సంబంధిత అధికారులతో మరియు సతీసమేతంగా విచ్చేసి ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్ లో (సమతా నగర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద) జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైదర్ నగర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని నగర పౌరులకు పరిపాలన మరింత చేరువ చేసేలా వార్డు పాలన నేటి నుంచి మొదలు కానున్నది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ వార్డులో 10 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి..ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నారు అని ఈ వార్డులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డు ఎంటమాలజిస్ట్, వార్డు ఇంజినీర్, వార్డు టౌన్‌ప్లానర్, వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్, వార్డు శానిటరీ జవాన్, వార్డు అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, వార్డు కంప్యూటర్ ఆపరేటర్, వార్డు రిసెప్షన్, జలమండలి అధికారులు, టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు సేవలందిస్తారు.
ఇందులో భాగంగానే వార్డు పరిపాలన అధికారులుగా సహాయ మున్సిపల్ కమిషనర్లు (ఏఎంసీ), సూపరింటెండెంట్లు, ఇంజినీర్లు వారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. వార్డు కార్యాలయంలో ఆయా విభాగాలకు నేమ్ బోర్డుతోపాటు టేబుల్, కుర్చీలను ఏర్పాటు చేశారు అని. వార్డు ఆఫీసులో ఇంటర్నెట్ సౌకర్యం, ప్రజల కోసం బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఏర్పాటు చేయడం జరిగింది అని, వార్డు కార్యాలయం లో ఏ సమస్యను ఎవరికి చెప్పాలి.. ఎన్ని రోజుల్లో ఆ సమస్య పరిష్కారమవుతుందో తెలిపేలా సిటిజన్ చార్టును కూడా ఏర్పాటు జరిగిందని తెలియజేశారు. హైదర్ నగర్ డివిజన్ ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మీ కాలనీ, బస్తీలలో ఉన్న సమస్యలు నేరుగా తెలియజేయండి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సహాయ మున్సిపల్ కమీషనర్ సందేశ్ చంద్ శ్రీ వాస్తవ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేన్, ఏఈ రాజీవ్, మేనేజర్ ప్రశాంతి, న్యాక్ ఇంజనీర్ చందు, వర్క్ ఇన్స్పెక్టర్లు మహదేవ్, దేవి, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ సుధాకర్, ఎంటమాలజి మురళి, హరికల్చర్ దాసు, వాటర్ వర్క్స్ అలీ ఖాన్, లైన్ మెన్ శర్మ, జవాన్ నర్సింగ్ రావు, రిసోర్స్ పర్సన్ ఏలెంద్ర, కంప్యూటర్ ఆపరేటర్ నీలిమ మరియు హైదర్ నగర్ డివిజన్ ప్రజలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.