కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Spread the love

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శాసనసభలో ‘నీటిపారుదలశాఖ’ శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఈ మేరకు సీఎం ప్రకటన చేశారు. ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల   చంద్రశేఖర్‌రావు.. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యే, ఎంపీగా, పదేళ్లు రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 40 ఏళ్లుగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తన పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెలంగాణ పునర్నిర్మాణంలో వారి పాత్ర పోషించాలని, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా సభ సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడానికి ఆయనకు పూర్తి స్థాయిలో శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నారు.

చంద్రబాబు, పవన్‌ శుభాకాంక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్‌లో శనివారం పోస్టు చేశారు. కేసీఆర్‌ పోరాట పటిమతో అంచలంచెలుగా ఎదిగిన నాయకుడని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు…

Related Posts

You cannot copy content of this page