SAKSHITHA NEWS

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్

సాక్షిత అశ్వారావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలొ
మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్ చేశారు గురువారం పాత యంపిడివో కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు.సమ్మే ను ప్రారంభిస్తూ జరగినసభలో
రమేష్ మాట్లాడుతూ
2022 మార్చి 15న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై అదనంగా రూ.2,000/-లు పెంచుతున్నట్లు ప్రకటించారు అని , యూనియన్ ఆధ్వర్యంలో చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీఓఎంఎస్ నెం. 89 విడుదల చేసింది.

కానీ కార్మికులు పెరిగిన జీతం ఇంతవరకు ఇవ్వలేదు. పెండింగ్ బిల్లులు కూడా విడుదల కావడం లేదు. కార్మికులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన వేతనాలకు బడ్జెట్ కేటాయించి చెల్లించాలని, పెండింగ్ బిల్లులు, గుడ్లకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని ,నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి వంట చేసిపెట్టిన వారికి బిల్లులు రాలేదు.

దీంతో కార్మికులు అప్పులపాలైనారుఅని, తెచ్చిన అప్పుల వడ్డీలు పెరిగిపొయ్యాయి. ఇప్పుడున్న మెనూకే కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదు. పైగా కొత్త మెనూ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, వారానికి 3 కోడు గ్రుడ్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా బడ్జెట్ కేటాయించకుండా కొత్త మెనూ పెట్టడం సాధ్యం కాదు. కొత్త మెనూకి అదనపు బడ్జెట్ కేటాయించాలి లేదా పాత మెనూనేకొనసాగించాలి, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ సిఐటియు మండల కన్వీనర్ కేసు పాక నరసింహారావు యామిని పద్మ రాములమ్మ కనక నన్ని తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 29 at 11.10.43 AM

SAKSHITHA NEWS