రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

Spread the love

సాక్షిత : *పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు పోషక విలువల కోసం అందిస్తున్న రాగిజావ తాగేందుకు శాశ్వత గ్లాసులను ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల సౌజన్యంతో నీలం మధు ముదిరాజ్ పంపిణీ చేశారు, విద్యార్థుల భవిత ఎంతో ముఖ్యమైనదని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తుందని తెలిపారు,రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా తన వంతు సహకారంగా శాశ్వత గ్లాసులు విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.వీటిని సద్వినియోగం చేసుకుని కన్న తల్లిదండ్రులకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు,అనంతరం NMR యువసేన మహిళ విభాగం కార్యాలయం ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుండ్ల మహేందర్ రెడ్డి,శంకర్,కృష్ణ,మహేష్,నాగరాజు,సురేష్,రాజు,సాయి,యాదగిరి, శాహిని,విజయ,విద్యార్థులు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page