సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం ప్రకటించిన తరువాత సికింద్రాబాద్ శాసనసభ్యులు, పార్లమెంట్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ తొలిసారిగా తెలంగాణా భవన్ కు చురుకొని, బీ ఆర్ ఎస్ నగరధ్యక్షుడు, జుబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయు సమావేశంలో పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎం ఎల్ ఏ లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎం ఎల్ సీ లు ప్రభాకర్, వాణీ దేవి, లతో పాటు హైదరాబాద్ ఎం పీ అభ్యర్ధి గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి ఇంచార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ ఇంచార్జ్ మన్నే గోవర్ధన్, సీనియర్ నేతలు డాక్టర్ దసోజు శ్రవణ్, రావుల శ్రీధర్ రెడ్డి, విప్లవ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బీ ఆర్ ఎస్ నేతలతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, ముషీరాబాద్, జూబ్లి హిల్స్, నాంపల్లి, అంబర్ పేట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలతో కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సమావేశంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ను భారీ ఆధిక్యతతో గెలిపించాలని వక్తలందరూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ ఎం పీ అభ్యర్ధిగా బీ ఆర్ ఎస్ నాయకత్వం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…