కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం

Spread the love

BRS hat-trick victory in Kutbullapur constituency is assured

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం…

అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుండి సుమారు 1200 మంది బీఆర్ఎస్ లో చేరిక…

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్, బతుకమ్మ బండ, నర్సింహా బస్తీ, రావి నారాయణ రెడ్డి నగర్ ఫేస్-1,2,3,4ల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, బస్తీల్లో పూర్తైన అభివృద్ధి పనులకు ఆకర్షితులై రావి నారాయణ రెడ్డి నగర్ వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో బిజెపి, కాంగ్రెస్ నుండి పీట్ల మల్లేష్ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కాలనీల్లో, బస్తీల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్న తరుణంలో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. నేడు అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గౌరవం ఉంటుందన్నారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు.

పార్టీలో చేరిన కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్,

సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీర్జా రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, హుస్సేన్, ఆబిద్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, మసూద్, సింగారం మల్లేష్, మూసాకాన్, నరసింహ, జగన్, చెట్ల వెంకటేష్, దిలీప్, ఇమ్రాన్ బైగ్, మహేష్, లక్ష్మీ, సుజాత, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page