బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ దొంగలే..

Spread the love

ఇద్దరిని ఎందుకు గెలిపించాలి?
వెంకట్రాంరెడ్డి భూ బకాసురుడు
బిఆర్ఎస్ హాయంలో రాక్షస పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదు
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి
పటాన్చెరులో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ సన్నాహక సమావేశం*
హాజరైన మంత్రి కొండా సురేఖ,
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
మెదక్ పార్లమెంటు నుంచి పోటీలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ కూడా దొంగలేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులని ఎంపీ ఎన్నికలలో గెలిపించాల్సిన అవసరం ఉన్నదా? అని ప్రశ్నించారు. పటాన్చెరు పరిధి రామచంద్రపురం లోని శ్రీ కన్వెన్షన్ హాలులో బుధవారం ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్నాహ సమావేశం NSUI రవీందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కొండా సురేఖ, ఎమ్మెల్సీ, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సంగారెడ్డి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి,పటాన్చెరు ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్,దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వెంకట్రామిరెడ్డి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడి, పేదల పొట్టలు కొట్టాడన్నారు. కెసిఆర్ పాలనలో వెంకట్రామిరెడ్డి కోట్ల రూపాయలు దండుకున్నాడని అన్నారు. కేవలం వారి నేతలకు, నాయకులకు మాత్రమే పథకాలు పనులు లాంటివి చేసి దుర్మార్గపు రాక్షస పాలన బిఆర్ఎస్ కొనసాగించిందని ఆరోపించారు. నాడు అసలైన తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను కాదని,వేరే వ్యక్తులకు బిఆర్ఎస్ అన్నింట్లో అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. రెండోసారి కూడా ఈ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు పట్టం కడితే, వారిలో ఎటువంటి మార్పులు రాలేదని, ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రాజెక్టులలో సరైన విధంగా నీళ్లు నింపి, సక్రమమైన పరిపాలన కొనసాగిస్తే, ఈరోజు ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల , ఎస్సారెస్పీ, శ్రీశైలం డ్యాముల రూపకల్పన వల్లే జిల్లాల్లో పంటలు పండుతున్నాయి అన్నారు.బిఆర్ఎస్ చేసిన పనుల వల్ల రైతులకు ఎంతగానో నష్టపోవాల్సి వచ్చింది అన్నారు. అసెంబ్లీ కి రానటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికలు రావడంతోనే బయటకు వచ్చారని ఆరోపించారు. సామాన్యుల ఫైళ్లను టేబుల్ ఫైళ్లను పక్కన పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కేవలం మేడిగడ్డ మిషన్ భగీరథ వంటి ఫైళ్ళ పైనే సంతకాలను చేస్తూ పరిపాలన కొనసాగించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గత పాలకులు చేయనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీ ల అమలుపై హరీష్ రావు, కేటీఆర్ నిందిస్తున్నారని, వారికి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలను ఇంటింటికి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులకు సురేఖ సూచించారు. అలాగే ఈ ఎంపీ ఎన్నికలే నాయకుల భవిష్యత్తును డిక్లేర్ చేస్తాయని కూడా పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను ఆమె కోరారు.

సైనికుల్లా పనిచేసి…
నీలం మధు గారిని గెలిపించాలి
ఎమ్మెల్సీ, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

కాంగ్రెస్ జెండా కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని ఎమ్మెల్సీ, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. మెదక్ నుంచి బిఆర్ఎస్, బిజెపి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరు ఒకటేనని అన్నారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు కలిసి వచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ బరిలో ఉంచిందన్నారు. ఇరు పార్టీల మధ్య ఒప్పందం ఎప్పటి నుంచో కొనసాగుతుందని ఆరోపించారు. ప్రస్తుతానికి బిజెపి మతం పేరుతో రాజకీయం చేస్తుందని. దీన్ని యువత పసిగట్టి తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి గ్యారెంటీలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యువ నేతకు అవకాశం వచ్చినందున అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్నారు.

పొరపాట్లను సరిదిద్దుకొని …
ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలి..

  • కాటా శ్రీనివాస్ గౌడ్

గత పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోయి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిజెపి మతోన్మాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుందని, ఆయన శక్తులకు కాంగ్రెస్ నాయకులు తిప్పి కొట్టాలన్నారు. సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో చిచ్చుపట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే ముందుకు వెళ్ళామో? ఈ ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపునకు కృషి చేయాలని సూచించారు.

గెలిపించండి.. రుణం తీర్చుకుంటా…
ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

ఎంపీ ఎన్నికలలో తనను గెలిపిస్తే ఈ మెదక్ ప్రాంత అభివృద్ధి పదంలో తీసుకెళ్లి, రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఒకనాడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరమ్మ ప్రధాని అయి ఈ ప్రాంతానికి ఎంతో చేశారని అన్నారు. బీడీఎల్ , బిహెచ్ఎల్ తోపాటు అనేక కర్మాగారాలు ఇతరత్రా మౌలిక వసతులను ఇందిరాగాంధీ కల్పించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రస్తుతానికి బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎవరికి సహాయం అందించినది లేదన్నారు. తనను గెలిపిస్తే 100 కోట్లతో ట్రస్టును ఏర్పాటు చేసి, సహాయం చేస్తున్నానని ప్రగల్బాలు పలుకుతున్నాడు అన్నారు. కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి మానవత్వం చూపకుండా కనీసం ఎవరికి టైం ఇచ్చేవాదు కారన్నారు. తాను ఈ ప్రాంతంలో ఎవరైనా కష్ట సుఖాలలో ఉండి తన తలుపు తడిపిన వారందరికో సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.బిఆర్ఎస్,బిజెపి అభ్యర్థులు గెలిస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారని, తనను గెలిపిస్తే ప్రజల్లోనే ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా నీలం మధు పేర్కొన్నారు. డిస్టిక్ ఐ ఎన్ టి యు సి ప్రెసిడెంట్ కొల్ల్కూరి నరసింహారెడ్డి, అసెంబ్లీ ఇంచార్జ్ వినయ్ గౌడ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ గౌడ్,బొల్లారం మున్సిపల్ చైర్మన్ అంతిరెడ్డి గారి అనిల్ కుమార్,పీసీసీ మెంబర్లు, బ్లాక్ కాంగ్రెస్, మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి,నాయకులు శ్రీశైలం,రవీందర్,నారాయణ రెడ్డి, ఎన్ఎస్ యుఐ సభ్యులు ,యూత్ కాంగ్రెస్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page