పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

Spread the love

పల్నాడు జిల్లా

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా వారు మెదటిగా గంటవారిపాలెం గ్రామ హైవే పై వద్ద నూతనంగా 5 లక్షల రూపాయల తో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. అనంతరం వేల్పూరు గ్రామం లో నూతనంగా 40 లక్షల రూపాయల తో నిర్మించిన కాలువ కట్ట పై గల సిసి రోడ్ ను ప్రారంభించారు..

వెలమవారిపాలెం గ్రామం నందు త్రాగు నీటి కోసం 81 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే త్రాగు నీటి వాటర్ ట్యాంక్ నిర్మాణ కొరకు సంబంధిత అధికారుల తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం పెద్ద కాలువ నుంచి వేల్పూరు గ్రామంలోని చెరువు కి పైప్ లైన్ నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం ద్వారా 1 కోటి రూపాయల వ్యయంతో పైపు లైన్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు వారు…

అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాటు చేసిన సభ లో అభివృద్ధి పనులపై ప్రసంగించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు.

Related Posts

You cannot copy content of this page