ఇక జరిగేది కురుక్షేత్ర యుద్ధం సీఎం జగన్

Spread the love

ఇక జరిగేది కురుక్షేత్ర యుద్ధం

న్యాయం ధర్మం మీద మీ బిడ్డ వెంట ఉన్నాయి

కుళ్ళు, కుతంత్రాలు మరోవైపు ఉన్నాయి – సీఎం జగన్

దోపిడీనే రాజకీయంగా మార్చకున్న చంద్రబాబు

నిడదవోలు సభలో సీఎం వైయస్‌ జగన్‌

ఇటీవల సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టైన ఒక మహానుభావుడు చంద్రబాబు గురించి నాలుగు మాటలు చెబుతాను..

దురదృష్టమేమిటంటే ఎంత దోపిడీ, దొంగతనాలు చేసినా, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు కాని.. చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పే వారు ఇన్నాళ్లూ లేరు.

ఒక మామూలు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అధికారంలో ఉన్నవారికి అదే శిక్ష పడుతుందని చెప్పేవారు ఇన్నాళ్లూ లేరు. చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పేవారు ఇప్పుడు గళం విప్పుతున్నారు. దీనిని ఈ దొంగల ముఠా సభ్యులు తట్టుకోలేకపోతున్నారు

చంద్రబాబునాయుడు.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా.. చివరికి ఆ వాయిస్‌ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చినా ఆయన వాటాదారులు , అరడజను ఎల్లో ఛానళ్లు, రెండు పత్రికలు బాబు ఏ తప్పు చేయలేదని చెప్పటానికి సిద్ధమయ్యాయి

స్కిల్‌ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ చెప్పినా కూడా స్కిల్‌ స్కాంలో ఫేక్‌ అగ్రిమెంట్‌ చేసిన దొంగలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసినా, కీలక సూత్రధారి చంద్రబాబేనని ఆధారాలు ఉన్నా.. అధికారుల చెబుతున్నా వినకుండా బాబే స్వయంగా ప్రభుత్వ సొమ్మును తెల్ల సూట్‌ కేసు సంస్థలకు మళ్లించిననట్లు ఆధారాలు చూసి కోర్టు చంద్రబాబును రిమాండ్‌కు పంపితే.. ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు.
ములాఖత్ లో మిలాఖత్!

సాక్ష్యాలు ఆధారాలతో అడ్డంగా దొరికినా… కేంద్ర సంస్థలు విచారణ జరిపి స్కాం జరిగింది అని నిర్ధారించినా ఎవరూ ప్రశ్నించరు

Related Posts

You cannot copy content of this page