బిజెపి శక్తి కేంద్రాల ఇంఛార్జులతో సమావేశమైన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

Spread the love

BJP National Vice President DK Aruna in a meeting with the in-charges of BJP Shakti Kendras

బిజెపి శక్తి కేంద్రాల ఇంఛార్జులతో సమావేశమైన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ


సాక్షిత : గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో ఆధ్వర్యంలో గాజులరామారం(125), చింతల్ (128), సూరారం (129), కుత్బుల్లాపూర్(130), జీడిమెట్ల(131) డివిజన్ల బిజెపి శక్తి కేంద్రాల ఇంచార్జిల సమావేశానికి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, అసెంబ్లీ పాలక్ డీకే అరుణ హాజరయ్యారు.

బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 7న జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో వర్చువల్ గా బూత్ కార్యకర్తల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు గరిగే శేఖర్ ముదిరాజ్, బావిగడ్డ రవి, బక్క శంకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భరసింహారెడ్డి, డివిజన్ల అధ్యక్షులు, ఇన్చార్జులు, శక్తి కేంద్రాల ఇంచార్జులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page