ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

Spread the love
Bhumana provides welfare schemes to every family

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తా భూమన

సాక్షిత : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 31 వ డివిజన్ బొమ్మగుంట, ఐ.ఎస్. మహల్ ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ఇంటింటికీ పర్యటిస్తూ జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులందరికీ తప్పకుండా జగనన్న సంక్షేమ పథకాలు అందిస్తానని భరోసా కల్పించారు. ప్రతి లబ్ధిదారులకు జగనన్న ఇంటి నిర్మాణం చేపడతామని, ప్రజల జీవితాల్లో ఆనందం నింపడం కోసమే జగనన్న ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.

జగనన్న ను మళ్లీ ముఖ్యమంత్రి ని చేసుకుంటే సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయన్నారు. అందుచేత జగనన్నకు అందరు మద్దతుగా నిలవాలని భూమన కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష,ఉప మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు రేవతి, రామస్వామి వెంకటేశ్వర్లు, నగరపాలక అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page