తిరుపతిని మెట్రో సిటీలతో పోటీపడేలా అభివృద్ది చేస్తా – భూమన అభినయ్ రెడ్డి

Spread the love

తిరుపతిని మెట్రో సిటీలతో పోటిపడేలా అభివృద్ది చేయడమే తన లక్ష్యంగా, పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్లేలా పని చేస్తానని, రానున్న ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతిలోని జీవకోన, ముత్యాలరెడ్డి పల్లె, శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మీయ సమావేశాల్లో భూమన అభినయ్ రెడ్డి స్థానికులతో మాట్లాడి తనకు మద్దతివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.

గత ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి అభివృద్ధిని గాలికొదిలేశాయని, రోడ్లు నిర్మిస్తే రాజకీయంగా నష్టం జరగుతుందనే ఉద్దేశంతో ఎవరూ రోడ్లను నిర్మించే సాహసం చేయలేదని, కానీ స్థానికుడిగా నేను పుట్టిన మన ఊరు అభివృద్ధి చెందాలనే తపనతో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించామని వివరించారు. మన తిరుపతిని మెట్రో సిటీలతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యమని, అందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నానని వివరించారు. ఇందుకు మీఅందరి సహకారం కావాలని, గత ఐదేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి నాకు ఓటు వేయాలని కోరుతున్నానని అభినయ్ విజ్ఞప్తి చేసారు. మీరంతా అండగా నిలబడితే తిరుపతిని మరింత అభివృద్ధి చేసి తీరుతానని మీకు మాట ఇస్తున్నానని, కులానికి కాదు అభివృద్ధికి పట్టం కట్టాలని అభ్యర్థిస్తున్నాని భూమన అభినయ్ విజ్ఞప్తి చేసారు. రానున్న రోజుల్లో జీవకోనని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాటిస్తున్నానని, గతంలో ఎన్నడూ లేని విధంగా జీవకోన రోడ్డును ఎంత విస్తరణ చేయగలిగామని, అలాగే విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించామని, మౌలిక సదుపాయాలు కల్పించి అండగా ఉన్నామని, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామనే భరోసా ఇచ్చామని గుర్తు చేసారు.

రానున్న రోజుల్లో సత్యనారాయణపురం సర్కిల్ నుంచి బైపాస్ రోడ్డుకి రహదారిని వెడల్పుగా వేసి స్థానిక ప్రజలకి ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇస్తున్నామని అభినయ్ తెలిపారు. 5 ఏళ్ల క్రితం మన తిరుపతి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని మీరే చూస్తున్నారని, పక్క జిల్లాల ప్రజలు ఈర్ష్య పడేలా అభివృద్ధిలో నగరాన్ని పరుగులు పెట్టిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని మాట ఇస్తున్నానని, స్థానికుడిగా మీ సమస్యలు తెలిసిన నాయకుడగిగా రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, వారసత్వంగా కాదు నేను చేసి అభివృద్ధి మీకు కనపడితేనే నాకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నానని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page