SAKSHITHA NEWS

ఉత్తమ వైద్యులకు సమాజంలో గుర్తింపు : ఎం.ఎల్.ఏ. పద్మారావు గౌడ్
సాక్షిత:సికింద్రాబాద్ : సమాజంలో వైద్య వృత్తి పవిత్రమైనందని, ప్రజల్లో ఆదరణ పొందిన వైద్యులకు నిరంతరం గుర్తింపు ఉంటుందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ కు చెందిన వైద్యాధికారి ణి డాక్టర్ సక్కు బాయి పదవీ విరమణను పురస్కరించుకొని శనివారం సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ క్యాంపు కార్యాలయంలో ఆమెను పద్మారావు గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ సక్కు బాయి సేవలు చిరస్మరనీయంగా నిలుస్తాయని ప్రశంసించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app