తుల్జా అంబా భవాని మాత నుదర్శించుకున్న బంజార సంఘం నాయకులు

Spread the love

తుల్జా అంబా భవాని మాత నుదర్శించుకున్న బంజార సంఘం నాయకులు

— దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో దర్శించుకున్న నాయకులు

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

బంజారాలు అత్యంత పవిత్రంగా పూజించే మహారాష్ట్రలో కొలువైవున్న శ్రీ తుల్జా అంబా భవాని మాతను దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు అంబా భవాని కి నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను చర్చించుకొని వచ్చే ఎన్నికల్లో దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని, వారిని శాసన సభకు పంపడానికి కావాల్సిన ఆర్థిక, మనో ధైర్యాలు ప్రసాదించాలని భవాని మాతను వేడుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని గిరిజనులందరిని ఏకతాటిపై నడిపించడానికి కావాల్సిన ప్రణాళికలను చర్చించుకున్నారు. ఈ యాత్రలో దేవరకొండ బంజార సంఘం ప్రముఖులు, బావోజీలు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page