SAKSHITHA NEWS


Bachupalli flyover and road widening works were inspected by the MLA.

బాచుపల్లి ఫ్లై ఓవర్, రోడ్డు వెడల్పు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తా వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో సుమారు రూ.180 కోట్లతో చేపడుతున్న ఫ్లై ఓవర్ పనులు, రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి మరియు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ మేరకు ప్రజల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ డిఈఈ వేణుగోపాల్ రావు, ఏఈఈ రమేష్, స్థానిక కమిషనర్ వంశీకృష్ణ మరియు అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS