చల్లపల్లి పడమర వైపు గ్రామ సచివాలయం ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు తెలిపారు.
ఆరోగ్య సురక్ష సమర్ధవంతంగా అమలు చేయటంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవల పరిధిని రూ.25లక్షలకు పెంచి నిరుపేద కుటుంబాలకు వైద్య భరోసా కల్పించిన ఘనత పొందారన్నారు. రాష్ట్ర ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహనరెడ్డిని మరోసారి దీవించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ చేకు చిన్న రాట్నాలు, పంచాయతీ ఈఓ పేర్ని మాధవేంద్రరావు, శానిటరీ అధికారి కలతోటి సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ పాగోలు నాగ సీతా రామారావు (ఫణి), వైసీపీ మండల మహిళా అధ్యక్షురాలు బొందలపాటి లక్ష్మి, పార్టీ నాయకులు తుమ్మల వెంకటేశ్వరరావు, వెనిగళ్ళ తారక జగదీష్, పఠాన్ కరీముల్లా ఖాన్, యడ్ల జగదీష్, జుజ్జువరపు భాగ్యారావు, అల్లంశెట్టి మధు, లక్ష్మీపురం ఎంపీటీసీ నూకల వెంకటేశ్వరరావు, మోదుమూడి కుటుంబరావు, గ్రామ సచివాలయ కార్యదర్శులు తిరువీధుల రాజశేఖర్, మెరకనపల్లి నాగ వెంకట తిరుమలేష్, పూషడపు విష్ణు, వార్డు సభ్యులు బళ్లా లలితకుమారి, బలే మధుర మీనాక్షి, వైద్యులు, ఎం.ఎల్.హెచ్.పీలు, పురిటిగడ్డ పీ.హెచ్.సీ సిబ్బంది, గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు.