ASR Brindavanam Colony Ellamma Temple Committee under Bachupalli
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పరిధిలోని ఏ ఎస్ ఆర్ బృందావనం కాలనీ ఎల్లమ్మ ఆలయ కమిటీ అద్వర్యంలో నిర్వహించిన నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ఆ మహాగణపతి ఆశీస్సులు తీసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అనంతరం తాను మాట్లాడుతూ మహాగణపతి నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో కుంటలోనూ నిమజ్జనం చేస్తారు కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు.
21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక… ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం అని తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్బరాజు ,శివరామకృష్ణ, కృష్ణరావు ,శ్రీనివాస్ రావు ,చందు రెడ్డి ,సురేష్ రాజు ,పాల్గొన్నారు