హైదరాబాద్ జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో, పారిశుద్ధ్య మరియు ఎంట‌మాల‌జీ కార్మికుల శ్రేయస్సుకై వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను

Spread the love

Hyderabad GHMC under their aegis, personal protective equipment kits for the welfare of sanitation and entomology workers.

ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో, పారిశుద్ధ్య మరియు ఎంట‌మాల‌జీ కార్మికుల శ్రేయస్సుకై వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కార్పొరేటర్ కార్యాలయంలో ఎంటమాలజీ కార్మికులకు అందచేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, పారిశుధ్య మరియు ఎంటమాలజీ సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు. అలాగే విధుల్లో ఉన్న‌ప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా కిట్లు ధ‌రించాల‌ని సూచించారు. కిట్లను అందుకున్న కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణా బాబాయ్, చంద్రశేఖర్ రెడ్డి, పి.వి సత్యనారాయణ, శంకర్ రావు, ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page