కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు

Spread the love

కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు

-21 పరీక్షా కేంద్రాలలో 12,156 మంది అభ్యర్థులు

-పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

-ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అధికారులందరి సమన్వయ సహకారంతో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షలను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ప్రకటనలో పెర్కొన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకొని ప్రిలిమ్స్‌ రాత పరీక్షలలో, దేహధార్యుడ్య పరీక్షలలో అర్హత సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి మరియు జేఎన్టీయూహెచ్ ఆద్వర్యంలో ఈనెల 30వ తేదీన నిర్వహించనున్న తుది రాత పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పకడ్బందిగా
బందోబస్తు నిర్వహించేందుకు ,
పోలీసు యంత్రాంగం భద్రత ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు
ఖమ్మం నగర పరిసరాలలోని 21 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్న పరీక్షలకు 12,156 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు.
ఏప్రియల్ 30 వ తేదీన
ఉదయం 10 గంటల నుండి 1:00 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరిక్ష కేంద్రల పరిసర ప్రాంతాలలో ఏలాంటి మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, అడ్వటైజ్మెంట్, ట్రాఫిక్ ఆంతరాయం కాకుండా, సమీపంలోని జిరాక్స్ సెంటర్ బంద్ చేసేలా పటిష్టమైన చర్యలు తీసుకొవాలని సూచించారు. పరిక్ష కేంద్రాలను ముందుగానే
సందర్శించి స్ధానిక పరిస్థితులు అంచనా వేసి అవసరమైన బందోబస్తు, భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. పరిక్ష జరిగే సమయంలో సంబంధిత పరిక్ష నిర్వహణ, పర్యవేక్షణ అధికారులు మినహా పరిక్ష కేంద్రంలోనికి ఎవరికి అనుమతి లేదనే విషయాన్ని పోలీస్ సిబ్బంది గ్రహించాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది విధివిధానాలపై పోలీస్ అధికారులు మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు.
పరీక్ష సమయానికి గంటముందే టెక్నికల్ బృందం అభ్యర్థుల బయోమెట్రిక్, ఫింగర్ ఫ్రంట్స్, ఫోటో ఐడెంటిఫికేషన్ లో పరిశీలించి పరిక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారని తెలిపారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుండి పరీక్ష పూర్తయ్యే వరకు మరియు తదుపరి ప్రక్రియలు ముగిసే వరకు భద్రతా ఏర్పాట్లను అందించాలని సూచించారు. ఉదయం 10.00 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదన్నారు.
అభ్యర్థులు చేతులకు గోరింటాకు మెహేంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్లో వేలి ముద్ర సరిగా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం వుందని తెలిపారు. అంతేకాకుండా పరీక్షకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితం అమలు చేయబడుతుందని పరీక్ష పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే ఎవరినీ నమ్మరాదని, అలాంటి వ్యక్తులు ఏవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం..
పరీక్షా కేంద్రాలు దూరంగా ఉన్నట్లయితే రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు మరియు తిరిగి వెళ్లడానికి తగిన సంఖ్యలో బస్సులు నడపేందుకు సంబంధిత ఆర్ టి సి అధికారులను సంప్రదించాలని అన్నారు.
ఎగ్జామినేషన్ డ్యూటీ సిబ్బంది మరియు పరీక్షా కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు మినహా బయటి వ్యక్తులెవరూ ప్రాంగణంలోనికి అనుమతించబడకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా అభ్యర్థులను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా కానిస్టేబుళ్లు / హోంగార్డులను నియమించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల లోపల వున్న జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్‌లు మూసివేయాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు/కార్యకలాపాలు/పైరవికార్లు/బ్రోకర్ల కోసం లాడ్జీలు మరియు ఇతర ముఖ్యమైన స్థలాలను తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పెట్రోలింగ్ పార్టీలనునియమించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సంబంధిత నిఘాను ఏస్ బి ఫీల్డ్ స్టాఫ్‌ని నియమించి సమాచారం సేకరించాలని అన్నారు.
అభ్యర్థులు మరియు డ్యూటీ అధికారులు ఎవరూ పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ మొదలైన వాటిని తీసుకెళ్లరాదని అన్నారు.
బందోబస్తు సిబ్బంది తమ మొబైల్ ఫోన్‌లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు మరియు స్మార్ట్ వాచ్‌లను పరీక్ష బి/బి డ్యూటీ కోసం తీసుకెళ్లకూడదని ఆదేశించారు.

పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్న తుది వ్రాత పరిక్షల సందర్భంగా అయా పరిక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 21 పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఆంక్షలు అమలుల్లో వున్నందున ఏప్రియల్ 30 న ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page