Appointment of new management of Eepur Market Yard
ఈపూరు మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం నియామకం
సాక్షిత : ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు చైర్మన్ గా చుండూరి రాఘవమ్మా w/o చుండూరి వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ గా బెలుం శ్రీరామ రెడ్డి మరియు 20 మంది సభ్యులతో కూడిన నూతన పాలకవర్గం నియామకంకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపి అనంతరం వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చుండూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని, తమ నియామానికి కృషి చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు.