AP Cabinet’s key decisions are pension hike
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు పెన్షన్ పెంపు
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ ను రూ.2,500 నుండి రూ.2,750 కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో 62.31 లక్షల మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కడపలో జిందాల్ స్టీల్ భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. హెల్త్ హబ్స్ ఏర్పాటులో కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి, భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. బాపట్ల, పల్నాడు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.