గుమ్మడిదల మండలం అన్నారం వడ్డెరలు బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు.
నీలం మధు సమక్షంలో వారు బీఎస్పీ కండువా కప్పుకుని పార్టీ లో చేరారు. బహుజనులకు అధికారం దక్కితేనే బడుగులకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తామంతా ఇక నుంచి నీలం మధు వెంట నడిచి తమ ఓట్లను మా బిడ్డకె వేసి భారీ మెజార్టీ తో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన మరుక్షణమే వడ్డెర ల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలంతా ఒక్క సారి తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో దామోదర్,శ్రీను,సంతోష్ కుమార్,రవి,సూర్య, పురుషోత్తం, శేఖర్,సుమన్,రవి, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.